రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సాలూరు మండలంలో గల బంగారంపేట అంబేద్కర్ విగ్రహం నందు నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు S.ధనుంజయ్ సభకు అధ్యక్షత వహిస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు టి అఖిల్ మాట్లాడుతూ…..
కులం పేరుతో విద్య, ఆస్తి, ప్రాథమిక హక్కులు లేకుండా చేసి, పశువులు కంటే హీనంగా, కట్టు బానిసలుగా దోపిడీ చేసి, దారుణంగా అణచివేయబడ్డ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సామాజిక తరగతులకు స్వాతంత్ర అనంతరం భారత రాజ్యాంగం అందరికీ విద్యా హక్కు కల్పించింది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగ రిజర్వేషన్ కల్పించింది. చట్టం ముందు అందరూ సమానమేనని ప్రాథమిక హక్కులు కల్పించింది. మరల మన రాజ్యాంగ హక్కులపై దాడి జరుగుతోంది. అందుకే రిపబ్లిక్ డే సందర్భంగా మనువాదుల నుండి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.రాష్ట్రం హక్కు కేంద్రం లాగేసింది ప్రాథమిక విద్యను కూడా కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంది. ప్రాథమిక విద్యను ముక్కలు చేసేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుండి వేల ప్రాథమిక పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు మూసేయడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమయ్యింది. బిజెపి కేంద్ర ప్రభుత్వ నేషనల్ విద్యా విధానంలో భాగమే ఈ కుట్ర కూడా. రాష్ట్రాలతో నిమిత్తం లేకుండా కేంద్రం ఏకపక్షంగా చేసిన నిర్ణయాలను రాష్ట్రం అమలు చేయడమే ఈ మార్పుల సారాంశం. ఇది పచ్చి రాజ్యాంగ వ్యతిరేక చర్య. రాష్ట్రం హక్కును కేంద్రం లాగేసినా ప్రతిఘటించకపోగా అమలు చేయడం చంద్రబాబు బీజేపీతో కలిసి రాష్ట్రానికి ద్రోహం చేయడమే. పవన్ కూడా భాగమే.
పేదలకు ఉచిత నాణ్యమైన విద్య హులక్కే
ప్రభుత్వ స్కూల్స్ మూసేసి, ప్రాథమిక, ఉన్నత విద్య ప్రైవేటుపరం చేయడంతో ప్రభుత్వం అందరికీ ఉచిత విద్య చెప్పాలనే రాజ్యాంగ ఆదేశాన్ని నిరాకరించడమే. డబ్బున్న వారు ప్రైవేటు చదువులు చదువుకుంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనకబడిన వారికి అందుబాటులో స్కూల్స్, కాలేజీలు ఉండవు. ఉన్న వాటిలో టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు ఉండరు. మౌలిక సదుపాయాలు కూడా ఉండవు.
మనువాదులు వేల సంవత్సరాలు దళితులు, గిరిజనులు, బీసీలు, మహిళలకు చదువు లేకుండా చేసారు. మరల కేంద్రంలో బీజేపీ రూపంలో గద్దెనెక్కిన మనువాదులు మరల గతంలోకి తీసుకెళ్తున్నారు. వాళ్ళతో టిడిపి, జనసేనా జతకలిశాయి. మనమే ప్రభుత్వ విద్యారంగాన్ని, రాష్ట్రం హక్కులు, లౌకిక ప్రజాతంత్ర రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. అందులో భాగంగా రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా అంతటా ప్రదర్శనలు జరిపి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేద్దాం. విద్యార్థిని విద్యార్థులంతా కార్యక్రమం లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు సూర్య , సింహాద్రి ఎస్ఎఫ్ఐ మండల నాయకులు సంజీవ్, సునీల్, ఓబీస్, బుజ్జి, విద్యార్థులు పాల్గొన్నారు.