విజయనగరం జిల్లా
స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో రెండు రోజులు అనగా శుక్రవారం శనివారం రోజుల్లో సోలార్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్స్ పై సూర్య రెన్యువబుల్ ఎనర్జీ సిస్టమ్స్ లోకేష్,వసంత్ విశాఖపట్నం వారిచే వర్క్ షాప్ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు మాట్లాడుతూ బీటెక్ ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ విభాగలు కు చెందిన ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఈ వర్క్ షాప్ లో పాల్గొని ఈ వెహికల్ తయారు చేశారని తెలిపారు.ప్రస్తుత రోజుల్లో పర్యావరణ కాలుష్య నివారణలో భాగంగా సోలార్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్స్ కు డిమాండ్ పెరుగుతుందిని తెలుపుతూ,ఈ వెహికల్స్ పైన సోలార్ ప్యానల్ అమర్చడం ద్వారా బ్యాటరీ యొక్క లైఫ్ టైమ్ పెరగడమే కాకుండా నడుస్తుంటే ఆటోమేటిక్ గా చార్జింగ్ అవుతాయని చెప్పారు.మరియు ఫాల్ట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్,ఆటో కట్ ఆఫ్ చార్జర్,సెంట్రల్ లాకింగ్ సిస్టమ్,యాంటీ థెఫ్టింగ్ అలారమ్,బ్యాలెన్స్ డ్ రియల్ షాక్ అబ్జర్వర్స్,లోడ్ గేర్ సిస్టమ్స్ వంటి అధునాతన ప్రత్యేకతలు ఉన్న పరికరాలు ఇమిడి ఉండటమే ఈ వెహికల్ ప్రత్యేకత అని తెలిపారు.అలాగే ఈ మొత్తం వెహికల్ 48 ఓల్డ్ సిస్టమ్ తో తయారయిందని తెలిపారు. ఈ వెహికల్ ద్వారా 300 కిలోల లోడ్ తో 80 నుండి 100 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ బి.వెంకటరమణ,ఏఓ జి.అనిల్ కుమార్,వివిధ విభాగాధిపతులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


