విజయనగరం జిల్లా రామభద్రపురం శివారులో శనివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో దుండగులు ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు.. ఒక ఇంట్లో ముగ్గురు వ్యక్తులు చొరబడి సుమారు రెండున్నర తులాల బంగారం చోరీకి పాల్పడ్డారు. అనురాధ అనే మహిళ మెడలో తాడును దుండగులు తెంపడంతో ఆమె అడ్డుకొనగా చేతిపై స్వల్ప గాయం అయింది దుండగులు అక్కడ నుంచి పరారు అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు