వైసీపీ

ఆవిర్భావన వేడుకలు

డిప్యూటీ సీఎం రాజన్నదొర గారి ఆధ్వర్యంలో ఘనంగావైసీపీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు                                                 ఆయన నివాసంలో వైసీపీ జెండాను ఎగురివేసిన  డిప్యూటీ సీఎం రాజన్నదొర                                                  ప్రజా సంక్షేమమే ఎజెండాగా పాలన కొనసాగిస్తున్న వైసీపీ పార్టీ 13 వసంతాలు పూర్తి చేసుకొని నేడు 14 వ వసంతం లోకి అడుగుపెట్టిన సందర్భంగా సాలూరు పట్టణం లో ఆయన నివాసం వైసీపీ నాయకులు,కార్యకర్తలు నడుమ వైసీపీ జెండా ను ఎగుర వేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నన్నారు  అనంతరం స్వీట్స్ ను అందరికీ పంచి పెట్టారు.ఈ సందర్భంగా  రాజన్నదొర గారు మాట్లాడుతూ ఆశయాలు అంబరాన్ని తాకితే ప్రజాదరణే పునాదిగా నిలుస్తుందని వైఎస్సార్‌సీపీ నిరూపించిందని. ఆకాంక్షల ఉన్నతికి జనాభిమానమే బ్రహ్మరథం పడుతుందని,విశ్వసనీయత, విలువలకు విశ్వమే అండగా నిలుస్తుందని  చాటి చెప్పిందని తెలిపారు.ఈ సిద్ధాంతాలే ఊపిరిగా ప్రజా క్షేత్రంలో పురుడు పోసుకున్న జగనన్న స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మళ్ళీ జగనన్నే కావాలని కోరుకుంటున్నారని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *