తాటిపూడి రైతులకు గొర్రెపాటి బుచ్చి అప్పారావు మార్గదర్శకులు
_ మంత్రి కొండపల్లి శ్రీనివాస్

గజపతినగరం, అక్టోబర్ 13,
తాటిపూడి రైతులకు గొర్రెపాటి బుచ్చి అప్పారావు మార్గదర్శకులు అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. గంట్యాడ మండలం తాటిపూడి రిజర్వాయర్ నిర్మాణ సాధకుడు, మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి విశాఖ జిల్లా బోర్డు అధ్యక్షులు స్వర్గీయ గొర్రెపాటి బుచ్చి అప్పారావు 113 వ జయంతి సందర్భంగా అప్పారావు విగ్రహానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతన్నల శ్రేయస్సు కోసం తాటిపూడి రిజర్వాయర్ నిర్మాణానికి కంకణం కట్టుకుని పూర్తి చేసిన మహనీయుడు బుచ్చి అప్పారావు అన్నారు. వేలాది ఎకరాలకు సాగునీరు అందించే గొర్రెపాటి బుచ్చి అప్పారావు తాటిపూడి రిజర్వాయర్ పూర్తి చేయడంతోనే నేడు ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా మంచి మనిషిగా అనేక సేవలందించిన అప్పారావు విగ్రహం ఏర్పాటు చేయడం ఆయన సేవలకు మనం అందించే గౌరవం అన్నారు..ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ తాటిపూడి రిజర్వాయర్ నుంచి సాగునీరు రావడంతో కష్ట కాలంలో కూడా పంటలు పండుతున్నాయన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ మాట్లాడుతూ బుచ్చి అప్పారావు విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు జయంతోత్సవాల జరపటంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక పాత్ర వహిస్తున్నారన్నారు. కూటమి నాయకులు, పలువురు రైతులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి