పార్వతీపురం మన్యం జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎస్. లక్ష్మి వర్మ నియామకం
విశాఖపట్నం, అక్టోబర్ 16:
ఉత్తరాంధ్ర జిల్లాల్లో మహిళలకు సమాచార హక్కు చట్టం–2005 (RTI) పై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని జై ఆంధ్ర (జై భారత్) జాతీయ మహిళా సలహాదారుల సభ్యురాలు డాక్టర్ కే. ఇందిర ప్రియదర్శిని పేర్కొన్నారు.
జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేంద్రబాబు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో సంఘం బలోపేతానికి నూతన కమిటీ సభ్యులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎస్. లక్ష్మి వర్మను నియమించినట్లు వెల్లడించారు.
సంఘంలో ఇకపై చురుకుగా పనిచేస్తూ ప్రజలకు సేవలందించే వారికే పదవులు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. సమాచార హక్కు చట్టంపై ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అవగాహన కల్పించడంతో పాటు, ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకతను పెంపొందించేందుకు కృషి చేయాలని సూచించారు.
ఎస్. లక్ష్మి వర్మ నియామకంపై సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్, రాష్ట్ర అధ్యక్షులు పి. వెంకటనారాయణ, జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పాడ రామకృష్ణ తదితరులు అభినందనలు తెలిపారు.
మహిళలకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లక్ష్మి వర్మ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని పలువురు ఆకాంక్షించారు.

