చీటింగ్ చీటి దందా!

చీటింగ్ చీటి దందా!

సాలూరులో ప్రైవేట్ చీటి వ్యాపారంపై ఆరోపణలు

మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్.. కమిషన్ల పేరుతో వసూళ్లు.. డబ్బుల కోసం బెదిరింపులా?

సాలూరు:

సాలూరు పట్టణంలో ప్రైవేట్ చీటి వ్యవహారాలపై పలు ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు ప్రైవేట్ చీటి నిర్వాహకులు అధిక మొత్తంలో లావాదేవీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

చీటి పేరుతో లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో కమిషన్ల రూపంలో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

బాధితుడి ఆవేదన.. రూ.6 లక్షల చీటీలో రూ.18 వేల కోత!

సాలూరుకు చెందిన ఓ బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తాను రూ.6 లక్షల ప్రైవేట్ చీటి తీసుకోగా, అందులో రూ.18 వేల కమిషన్ మినహాయించి రూ.5,82,000 మాత్రమే చెల్లించారని పేర్కొన్నారు. ఇప్పటికే బ్యాంకు లావాదేవీల ద్వారా చెల్లింపులు చేసినప్పటికీ, మరో రూ.12 వేల కోసం ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

డబ్బుల విషయంలో ఆలస్యం జరిగితే ప్రామిసరీ నోట్ల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

కాల్ మనీ తరహా వేధింపులా?

చీటి వ్యాపారం పేరుతో జరుగుతున్న ఆర్థిక లావాదేవీలు, కమిషన్ల వసూళ్లు, బెదిరింపుల ఆరోపణలు చూస్తుంటే సాలూరులో ప్రైవేట్ చీటి వ్యవహారాలపై సమగ్ర విచారణ అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అధికారులు స్పందించాలి!

సాలూరులో జరుగుతున్న ప్రైవేట్ చీటి లావాదేవీలపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని, బాధితుల ఫిర్యాదులు స్వీకరించి విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రైవేట్ చీటి వ్యాపారం చట్టబద్ధంగా జరుగుతోందా? కోట్ల రూపాయల లావాదేవీల వెనుక అసలు వాస్తవాలు ఏమిటి? బాధితులకు న్యాయం ఎప్పుడు?

ఇది ఒక్కరి సమస్య కాదు.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాల భద్రతకు సంబంధించిన ప్రజా సమస్య!

THE 9 NEWS TELUGU
నిజం… మా లక్ష్యం.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి