కోటి యాభై లక్షల రూపాయిలు తో అనేక అభివృద్ధి కార్యక్రమాలు

చీపురుపల్లి జడ్పీటీసీ ఆఫీస్ ఛాంబర్ లో జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష,జిల్లా వైస్సార్ పార్టీ సెక్రటరీ వలిరెడ్డి శ్రీనివాసనాయుడు తో కలిసి మాట్లాడుతూ చీపురుపల్లి మండల జడ్పీటీసీ గా సుమారు 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం అని పెద్దలు మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు,జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారు చైర్మన్ గా వున్న టైం లో జడ్పీటీసీ గా ప్రజలకు ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినందుకు ఆనందంగా ఉంది అని తెలిపారు, చీపురుపల్లి మండలం లో సుమారు కోటి యాభై ()లక్షల రూపాయిలు తో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు,చీపురుపల్లి మండలంలో ప్రతి గ్రామానికి అవసరం అయిన దగ్గర సిమెంట్ రోడ్స్, డ్రైనేజి, అలాగే త్రాగునీరు బోర్లు,SC కమ్యూనిటీ హల్స్, ఇంటిగ్రెటెడ్ హాస్టల్ కి అవసరం అయిన మౌలిక సదుపాయాలు,స్కూల్స్లోటాయిలెట్స్, ఇంకా అవసరం అయిన పనులను గుర్తించి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారి ద్రుష్టి కి తీసుకుని వెళ్లి నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేసాం అని తెలిపారు,ఇంకా గ్రామాల్లో ప్రజలు ప్రజాప్రతినిధులు ఏవైనా సమస్యలు, పనులు మా ద్రుష్టి కి తీసుకుని వస్తే తప్పకుండ వాటిని కూడా గుర్తించి పరిష్కరిస్తామన్నారు,ఎంపీపీ , స్థానిక సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, నాయకులు అందరి సహకారంతో చీపురుపల్లి మండలాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందు ఉంచుతాం అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *