పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలం కరడవలస గ్రామంలో గిరి ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. సాలూరు మండలం కరడవలస లో గిరి ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన మంత్రి గారికి అక్కడ గిరిజన మహిళలు హారతులు ఇచ్చే దింసి డాన్సులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రిగారు, మరియు పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి గారు మాట్లాడుతూ గిరి శిఖర ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు అనారోగ్య సమయంలో , మరియు ప్రసవ సమయంలో మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా డోలి మూతలు లేకుండాఈ కంటైనర్ ఆసుపత్రిని గిరి శిఖర ప్రాంతంలో ఏర్పాటు చేశామని. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గిరిజనులకు మంచి జరిగిందని డోలి మూతలకు స్వస్తి పలకాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని, తొలి పైలెట్ ప్రాజెక్ట్ గా పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలం గిరి శిఖర ప్రాంతం కరడవలస లో కంటైనర్ ఆసుపత్రిని ప్రారంభించామని దీనికి గిరి ఆరోగ్య కేంద్రం అని నామకరణం చేశారు.అని ఈ గిరి ఆరోగ్య ఆసుపత్రిలో నాలుగు బెడ్లతో కూడిన గదిని ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రి వలన గిరిజనులకు మేలు జరగనుంది. సాలూరు మండలం 10 గ్రామాల ప్రజలకు ఈ ఆసుపత్రి ఉపయోగపడుతుందని . ఈ ఆసుపత్రిలో వైద్యుని గది,రోగులకు 15 రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు. ఇది రాకెట్ యుగము అని ఒక సెల్ఫోన్ తో ఎక్కడ వరకైనా వెళ్లొచ్చని అలాంటిది ఇ కాలంలో ప్రసవ సమయంలో మహిళలు ఇబ్బంది పడుతున్నారని నడిరోడ్డుపై గిరిజన మహిళల ప్రసవాలు చూస్తున్నామని ఒక మహిళగా చాలా బాధపడుతున్నానని చెప్పారు. అక్కడ గిరిజనులు మాట్లాడుతూ మాకు ఏదైనా వైద్యం అందాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇప్పుడు ఈ ఆసుపత్రి నిర్మించడం చాలా ఆనందదాయకమని మేము కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అక్కడ గిరిజనులు తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు డిఎఫ్ఓ,మరియు డిప్యూటీ డిఎంహెచ్వో ,వైద్యులు,గిరిజనులు పాల్గొన్నారు.