చీపురుపల్లి నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల గ్రామం జడ్పీహెచ్ స్కూల్ లో భోజన విరామ సమయంలో డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు మరియు పాఠశాలలో మౌలిక వసతుల పర్యవేక్షణకు వెళ్లిన చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీ విసినిగిరి శ్రీనివాసరావు గారు మరియు జనసేన నాయకులు.
అనంతరం పాఠశాలలోని భోజనం సమయంలో ఉపాధ్యాయులు విద్యార్థులతో మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకం లో భాగంగా భోజనాన్ని స్వీకరించి నాణ్యతను పరిశీలించారు. ఆ సందర్భంగా పాఠశాలలో ముఖ్యంగా మంచినీటి కొరత ఎక్కువగా ఉందని , ఆర్ ఓ ప్లాంట్ ఉన్నప్పటికీ లో వోల్టేజ్ కరెంట్ కారణంగా పనిచేయకపోవడం, అలాగే 60 అడుగుల లోతులో సబ్మెర్సిబుల్ బోర్వెల్ ఉండటం వలన నీరు అందించలేని పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని విద్యార్థులు తెలియజేశారు. అలాగే విజయనగరం జిల్లాలో ఒక పైలెట్ ప్రాజెక్టుగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో వీక్లీ టెస్టులు లకు సంబంధించి క్వశ్చన్ పేపర్స్ స్టేషనరీ ప్రభుత్వమే అందించాలని కోరారు. ప్రస్తుతానికి విద్యార్థులే వాటిని భరించాల్సి వస్తుందని తెలియజేశారు.
పైన తెలిపిన సమస్యలపై మాట్లాడుతూ ఈ యొక్క సమస్యలపై సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా వాటిని పరిష్కరించే విధంగా కృషిచేస్తామని భరోసా ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గుర్ల జనసేన పార్టీ మండల అధ్యక్షులు యడ్ల సంతోష్ గారు, బెవర కూర్మారావు, చందక బాల రేగన అప్పలనాయుడు రేగన రామారావు సత్యాజి సబ్బి సింహాచలం జనసేన శంకర్ రమణ తదితరులు పాల్గొన్నారు.