అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు :
స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో బుధవారం మధ్యాహ్నం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా జరిగాయి.ఈ వారోత్సవాల్లో భాగంగా ముందుగా ఫాదర్ అఫ్ లైబ్రరియన్ ఎస్.ఆర్.రంగనాధన్ గారుకు పూలమాలవేసి అనంతరం లైబ్రరియన్ క్రాంతి గారు బి.టెక్,డిప్లమో డిజిటల్ లైబ్రరీ పై అవగాహన కల్పించారు.అలాగే వివిధ విభాగాలకు సంబంధించిన పుస్తకాలు,మ్యాగజైన్స్, కాంపిటేషన్,మోటివేషనల్ తదితర పుస్తకాలు ప్రదర్శించారు.ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు మాట్లాడుతూ విద్యార్థి యొక్క విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడతాయని తెలుపుతూ,ప్రతి విద్యార్థి కొంత సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ బి.వెంకటరమణ,ఏఓ జి.అనిల్ కుమార్,వివిధ విభాగాధిపతులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.