ఆదివారం నాడు విజయవాడ, పటమట Indoor స్టేడియంలో జరిగిన స్టేట్ లెవెల్ కరాటె ఛాంపియన్ షిప్ – ప్రెసిడెంట్ కప్ లో మన చీపురుపల్లి కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొని పదకాలు సాదించారు,
అందులో భాగంగా కుమతి విభాగంలో వజీర్ భాష మొదటి స్థానం,
నితీష్ ద్వితీయ స్థానం, కాటా విభాగంలో ప్రసాంత్ ద్వితీయ స్థానం మరియు రాహుల్ 3వ స్థానం లో నిలిచారు,ఈ సందర్బంగా చీపురుపల్లి జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, జిల్లా వైస్సార్ పార్టీ సెక్రటరీ వలిరెడ్డి శ్రీనివాసనాయుడు పధకాలు సాధించిన విద్యార్థులు ను అభినందించారు, చీపురుపల్లి లాంటి గ్రామీణ ప్రాంతం లో కరాటే లాంటి ప్రతిభా వంత మైన ఆత్మ రక్షణ కు సంబందించిన ఈ విద్యను మన విద్యార్థులు కు శిక్షణ ఇచ్చి మన చీపురుపల్లి ప్రాంత విద్యార్థులు ఈ మెడల్స్ సాధించడం లో శిక్షణ ఇచ్చిన శేఖర్ మాస్టర్ ని అభినందనలు తెలియజేసారు, జాతీయ స్థాయి లో కూడా ఇంకా ఎన్నో పతకాలు సాధించాలని కోరారు, ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష,జిల్లా వైస్సార్ పార్టీ సెక్రటరీ వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,కరాటే మాస్టర్ శేఖర్,నాగచైతన్య,రామారావు, నీలకంఠం,చక్రి, విద్యార్థులు పాల్గొన్నారు.