విజయనగరం జిల్లా చీపురుపల్లి లో చీపురుపల్లి విజయనగరం ప్రధాన రహదారిలో పాత ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి దగ్గర్లో రోడ్లు మరియు భవనాలు శాఖ ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా రెండు 5 అడగులు లోతు గల పెద్ద గుంతలను తవ్వించారు. కారణాలు ఏమైనా కావచ్చు గాని, గుంతలు కు కుత వేటు దూరంలో మూడు పాఠశాలలు ఉండడం గమనార్హం. ఎటువంటి సూచి బోర్డులు లేకుండా సుమారు 15 రోజుల క్రితం తవ్విన గుంతలు పూడ్చకుండా అలా వదిలేయడంతో అటువైపుగా ప్రయాణం సాగించేవారు ఉలిక్కిపడుతున్నారు. ప్రధాన రహదారి కావడంతో నిత్యం రద్దీ గా ఉండడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉండచ్చు.ప్రమాదం చెప్పి రాదు కాబట్టి పిల్లలు స్కూలు వదిలే సమయంలో అత్యంత రద్దీగా మారే ఆ ప్రదేశం రోడ్డుకి ఇరువైపులా గోతులు ఉండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు ఇప్పటికైనా ర.భా.శా శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారని అక్కడి కాలని వాసులు కోరుతున్నారు