ఇటీవల బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గజపతినగరం సమీప పెట్రోల్ బంక్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పాచిపెంట మండలం,మాతుమూరు గ్రామానికి చెందిన ఇప్పిలి.శ్రీను(28 సం.లు) మృతి చెందిన విషయం తెలిసిందే.కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న శ్రీను మృతి పట్ల *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు మాతుమూరు గ్రామానికి వెళ్లిన రాజన్నదొర గారు మృతుడు శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్