సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కోదుకరకవలస గ్రామానికి చేరుకున్న మంత్రి సంధ్యారాణి గారికి నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సంక్షేమ కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రతి ఇంటికి పంపిణీ చేశారు. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సంధ్యారాణి తెలిపారు. పారదర్శక పాలన ద్వారా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు పట్టణాలు, గ్రామాల పురోగతికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు పరమేశ్, మాజీ ఎంపీటీసీ అప్పికొండ రమాదేవి, యుగంధర్, మత్స శ్యామసుందర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ సాలూరు ఏరియా హాస్పిటల్కు నూతన తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనం సాలూరులో ఘనంగా తిరంగా యాత్ర