*తోపుడు బండి ప్రారంభోత్సవంలో సిరమ్మ*

*నిరుపేద వితంతువుకు జీవనోపాధి కల్పించి మరోసారి మనసు చాటుకున్న సిరమ్మ*

విజయనగరం, అక్టోబర్ 14:
పేదల కష్టాలకు స్పందించడంలో ఎప్పుడూ ముందుండే సిరమ్మ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. విజయనగరం హుకుంపేట సమీపంలోని లంకాపట్నంలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన భవిరిశెట్టి వెంకటలక్ష్మి (భర్త కీ.శే. సూర్యనారాయణ)కు జీవనోపాధి నిమిత్తం తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటరీ పరిశీలకలు మరియు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గౌ!! శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి కుమార్తె తెలుగుదేశం పార్టీ నాయకురాలు మరియు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షరాలు *సిరమ్మ* ఒక తోపుడు బండిని, టిఫిన్ వ్యాపారానికి అవసరమైన సామగ్రిని తన చేతుల మీదుగా బుధవారం బహూకరించారు.
భర్తను కోల్పోయి కుటుంబ పోషణ భారంగా మారిన వెంకటలక్ష్మి పరిస్థితిని తెలుసుకున్న *సిరమ్మ* ఆమె సొంతంగా నిలదొక్కుకునేలా స్వయం ఉపాధి మార్గాన్ని చూపించాలని ఈ సహాయం అందించారు. తోపుడు బండి ప్రారంభోత్సవాన్ని ఆమె స్వయంగా నిర్వహించి, వ్యాపారం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ సహాయంతో తన కుటుంబానికి ఆసరా లభించిందని వెంకటలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, స్థానిక ముఖ్య నాయకులు, ఉపాధ్యక్షులు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పేదలకు అండగా నిలుస్తున్న సిరమ్మ సేవా దృక్పథాన్ని వారు అభినందించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి