ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు
విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్*
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా అక్టోబర్ 30న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా ఎస్పీ *శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్ గారు* హాజరై, ఎన్నికల నిర్వహణకు జిల్లా పోలీసుశాఖ చేపట్టిన భద్రత, బందోబస్తు ఏర్పాట్లను వివరించారు.
రాష్ట్ర ఎన్నికల ఎలక్షన్ కమీషనర్ అనిల్ చంద్ర పునేఠా మాట్లాడుతూ – రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా సూచించారు. ఎన్నికల ప్రక్రియపై ఓటర్లలో పూర్తి విశ్వాసం కలిగించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు అవకాశం లేకుండా పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక, మున్సిపల్ ఎన్నికలు పోలింగు, కౌంటింగు ఏర్పాట్లపై జిల్లా కలక్టర్లు, ఎస్.పి.లు, ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులు, సంబంధిత ఎన్నికల అధికారులతో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా, ఐజీ రాజకుమారి, కార్యదర్శి మల్లికార్జున కలసి వీడియో కాన్ఫరెన్సులో ఎన్నికల ఏర్పాట్లు, భద్రత, పోలింగ్ కేంద్రాల తనిఖీలు, సిబ్బంది రవాణా, పోలింగు, కౌంటింగ్ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.
ఎన్నికల సమయంలో నిరంతర పర్యవేక్షణ, సమయానుకూల సమాచార సేకరణ, అధికారుల మధ్య సమన్వయం అవసరమని సూచించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, ఎన్నికల ఏర్పాట్లు, నిబంధనలు, పారదర్శకత, సమాన అవకాశాలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఎన్నికల వ్యవస్థను మరింత పటిష్టం చేసి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
పోలింగ్ సిబ్బంది రవాణాకు అవసరమైన వాహనాలు, రూట్ చార్టులు, దిశానిర్దేశక సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని, ఎలాంటి రవాణా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలన్నారు. తుఫాను ప్రభావిత జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా తనిఖీ చేయాలి. చెట్లు విరిగిపడటం, పైకప్పుల లీకేజీలు, ఇతర నష్టాలు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో భౌతిక తనిఖీలను శనివారం ఉదయం 10 గంటలలోపు పూర్తి చేసి లోపాలను సరిచేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఓటు రహస్యతకు భంగం కలగకుండా కెమెరాల దిశను నిర్దేశించాలన్నారు.
సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించాలన్నారు. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. మైక్రో అబ్జర్వర్లకు నిర్దేశించిన నివేదికలు అందించి, వారు అబ్జర్వర్ కౌంటర్లో రిపోర్ట్ చేసేలా చూడాలనన్నారు. మేయర్, రిటర్నింగ్ అధికారులు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను ఎన్నికల నిబంధనల ప్రకారం జాగ్రత్తగా నిర్వహించాలని తెలిపారు. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి సైలెంట్ పీరియడ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, ఎన్నికల ప్రచారం, మద్యం సరఫరాపై నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు.
స్థానిక ఓటర్లు కాని రాజకీయ నాయకులు, ఇతర బయటి వ్యక్తులు ఎన్నికల నియోజకవర్గ పరిధిలో ఉండకుండా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, గెస్ట్ హౌస్‌లు, కల్యాణ మండపాలు, ఇతర వసతి కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు రెండు విడతలుగా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
ఎన్నికల నిర్వహణలో ప్రతి శాఖ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చూడాలని సూచించారు. ఓటర్లకు పూర్తి భద్రత, స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తూ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.



