ఉత్తరాంధ్ర ఇకపై ‘ఉత్తమాంధ్ర’గా మారాలి

విజయనగరం, అక్టోబర్ 31 (9NEWS):

ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో ఇకపై ‘ఉత్తమాంధ్ర’ నినాదంతో జై ఆంధ్ర అసోసియేషన్ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని బీజేపీ ఏపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, జై ఆంధ్ర (జై భారత్) జాతీయ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి సోము లక్ష్మి తెలిపారు.

జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్ మాట్లాడుతూ, జాతీయ మహిళా గౌరవ అధ్యక్షురాలిగా సోము లక్ష్మిని నియమించినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా సోము లక్ష్మి మాట్లాడుతూ, అసోసియేషన్ వ్యవస్థాపకులు సుమిత్రానందన్ మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. మహిళల గౌరవం, హక్కుల పరిరక్షణకు తమ సంఘం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం విషయంలో కొందరు సిబ్బంది మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. వెంటనే ఆర్టీసీ డిపో మేనేజర్‌ను కలిసి, మహిళల పట్ల అవమానకరంగా ప్రవర్తించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు వెల్లడించారు.

మహిళల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సోము లక్ష్మికి రాష్ట్ర అధ్యక్షులు వెంకటనారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి