మున్సిపల్ ఎన్నికల భద్రత, బందోబస్తు విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందితో జిల్లా ఎస్పీ *శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్ గారు* పట్టణంలోని రాజీవ్ క్రీడా ప్రాంగణం (డిస్ట్రిబ్యూషన్ సెంటర్) వద్ద అక్టోబర్ 31న సమావేశమై, ఎన్నికల విధుల నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ *శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్ గారు* మాట్లాడుతూ – ఎన్నికల విధుల నిర్వహణలో ఎటువంటి అలసత్వం వద్దన్నారు. నిర్దేశించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించి, ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించుట లో భాగస్వామ్యులు కావాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలన్నారు. పోలింగ్ ప్రారంభం నుండే క్యూ లైన్లలో ఓటర్లను పంపాలన్నారు. పోలింగ్ అధికారి పోలీసుల సహాయం కోరితే తప్పా.. ఎవ్వరూ పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళొద్దన్నారు. పోలింగ్ కేంద్రంకు 100 మీటర్ల దూరంలో లైన్స్ వేయించాలని, 100 మీటర్ల లోపలికి ఎవ్వరిని అనుమతించ వద్దన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటర్లతో మర్యాదగా వ్యవహరించాలని, ఎవ్వరితోనూ గొడవపడవద్దన్నారు. విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది సంయమనంతో వ్యవహరించాలని, ఏదైనా సంఘటన తలెత్తితే వెంటనే సమాచారాన్ని ఇంచార్జ్ అధికారులకు సమాచారం తెలపాలన్నారు. ఓటర్లు, రాజకీయ పార్టీలు, నాయకులు పార్టీ గుర్తులు, కండువాలు వేసుకొని పోలింగ్ కేంద్రాల సమీపంలోకి రాకుండా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఎలక్షన్ కమీషన్ నిషేధించిన ఎలక్ట్రానిక్ వస్తువులను, వాటర్ బాటిల్స్, ఆయుధాలు తీసుకొని వెళ్లకుండా చూడాలన్నారు. 144 సి.ఆర్.పి.సి. అమలులో ఉన్నందున ఎవ్వరూ గుంపులుగా ఉండకుండా చూడాలన్నారు. పోలీసుల కారణంగా గొడవలు చూడాలన్నారు. విధుల్లో ఉన్న పోలీసులపై ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే మాత్రం కఠినంగా వ్యవహరించాలని అధికారులను జిల్లా ఎస్పీ *శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్ గారు* ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం డీఎస్పీ ఎస్.లక్ష్మణమూర్తి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, పలువురు సిఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



