*విజయనగరం మున్సిపల్ ఎన్నికల స్క్రోలింగ్ పాయింట్స్*
🔹 జిల్లాలో ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ.
🔹 విజయనగరం కార్పొరేషన్, బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీల్లో బ్యాలెట్ పత్రాల ద్వారా పోలింగ్.
🔹 మూడు స్థానిక సంస్థల పరిధిలో మొత్తం 2,91,409 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
🔹 పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
🔹 విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని 62 డివిజన్లలో 2,23,050 మంది ఓటర్లు.. మేయర్ పదవికి 7 మంది, కార్పొరేటర్ పదవులకు 169 మంది పోటీ.
🔹 విజయనగరం కార్పొరేషన్ పరిధిలో మొత్తం 229 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు.
🔹 బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులకు ఎన్నికలు.. 49,284 మంది ఓటర్లు, 69 పోలింగ్ కేంద్రాలు.
🔹 బొబ్బిలి మున్సిపల్ చైర్పర్సన్ పదవికి 4 మంది, కౌన్సిలర్ పదవులకు 95 మంది అభ్యర్థులు బరిలో.
🔹 నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో 23 వార్డులకు ఎన్నికలు.. 19,075 మంది ఓటర్లు, 24 పోలింగ్ కేంద్రాలు.
🔹 నెల్లిమర్ల చైర్మన్ పదవికి 4 మంది, కౌన్సిలర్ పదవులకు 59 మంది అభ్యర్థులు పోటీ.
🔹 మూడు పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 322 పోలింగ్ కేంద్రాలు.. నిర్వహణ కోసం 2,315 మంది పోలింగ్ సిబ్బంది నియామకం.
🔹 ప్రలోభాలకు లోనుకాకుండా ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ రాంసుందర్ రెడ్డి విజ్ఞప్తి.
🔹కలెక్టరేట్ కంట్రోల్ లో నుంచి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, జెసి సేధు మాధవన్.




