ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్
*- విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్*
🌀 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ *శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్*
🌀 వదంతులను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవన్న జిల్లా ఎస్పీ *శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్*
జిల్లాలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్, నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ *శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్ గారు* నవంబరు 1న సందర్శించి, భద్రత ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విటి అగ్రహారం, మజ్జిపేట, గాజులరేగ, ఎం.ఆర్.కళాశాల, సంస్కృత పాఠశాల, జొన్నగుడ్డి, దాసన్నపేట, బాబామెట్ట, కుమ్మరివీది, బుచ్చెన్న కోనేరు, సాకేటివీధి, వై.ఎస్.ఆర్.నగర్ పోలింగ్ కేంద్రాలను, నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని రామతీర్థం జంక్షన్, రెల్లివీది, జార్జాపేట పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ *శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్ గారు* స్వయంగా సందర్శించి, భద్రత ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.
జిల్లా ఎస్పీ *శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్ గారు* మాట్లాడుతూ –
• పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్లు అవతల మాత్రమే పార్టీలకు చెందిన టెంట్లు ఉండాలన్నారు.
• 100 మీటర్ల పరిధిలో ఓటర్లు మినహా మిగిలిన వారు ఎవ్వరూ ఉండకుండా చూడాలన్నారు.
• ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే విధంగా, వారిని ప్రక్కదారి పట్టించే విధంగా వదంతులను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
• ఎన్నికల నిర్వహణలో భద్రతపరమైన ఇబ్బందులు ఉంటే డయల్ 100/112 సమాచారం అందించాలన్నారు.
• ప్రజలు భద్రతకు అన్ని చర్యలు చేపట్టామని, స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
• జిల్లాలో విజయనగరం, బొబ్బిలి, నెల్లిమర్ల మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా భద్రత చర్యలు చేపట్టామన్నారు.
• ఇద్దరు అదనపు ఎస్పీలు, 6గురు డీఎస్పీలు, 18మంది సిఐలు, 70మంది ఎస్సై, ఇతర సిబ్బందితో కలిపి 2000మందితో బందోబస్తు, రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, జోనల్ స్ట్రైకింగ్ ఫోర్సులను ఏర్పాటు చేశామన్నారు.
• అధికారులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇచ్చేందుకు రెండు కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి, భద్రతను పర్యవేక్షిస్తున్నామన్నారు.
• పోలింగ్ కేంద్రాల వద్ద 144 సి.ఆర్.పి.సి. సెక్షన్ అమలులో ఉన్నందున పోలింగ్ కేంద్రాల వద్ద ఎవ్వరూ గుంపులుగా ఉండకుండా చూడాలన్నారు.
• జిల్లా ఎస్పీ *శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్ గారి* వెంట స్పెషల్ బ్రాంచ్ సిఐ ఏవీ లీలారావు, సిఐ కే.దుర్గా ప్రసాద్, స్పెషల్ పార్టీ పోలీసుకు ఉన్నారు.







