జై ఆంధ్ర (జై భారత్) కార్యక్రమాలను ప్రజలు మెచ్చుకున్నారు
జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీమతి నోరి పల్లవి
విజయవాడ, నవంబర్ 19:
జై ఆంధ్ర (జై భారత్) సమాచార హక్కు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆ సంఘం జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీమతి నోరి పల్లవి తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ఆరు సంవత్సరాలుగా ఫౌండర్ డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్ నాయకత్వంలో ఆర్టీఐ–2005 చట్టంపై తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, మహిళలకు జై ఆంధ్ర అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
అలాగే జిల్లాల వారీగా వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతూ సంఘాన్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని వెల్లడించారు.
అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు పి. వెంకట్ నారాయణ, రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి మల్లేశ్వరి, రాష్ట్ర అధ్యక్షురాలు అనిత, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్. సీతారామరాజు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం ఓఎస్డీ శ్రీ సి.హెచ్. రామారావు, శుభోదయం మీడియా చైర్మన్ శ్రీ లక్ష్మీ ప్రసాద్, ఈరోజు పత్రిక చైర్మన్ జె.వి. సుబ్రహ్మణ్యం, కలం పత్రిక చైర్మన్ లక్కరాజు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సలహాదారు ఎస్.ఎస్.ఎన్. మూర్తి తదితరులకు, కమిటీ సభ్యులకు నోరి పల్లవి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
