నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణ

నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణ
*- విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్*

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ వేసే కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ *శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్ గారు* అక్టోబర్ 17న స్వయంగా పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ విజయనగరం మున్సిపల్ ఆఫీస్, నెల్లిమర్ల నగర పంచాయతీ ఆఫీసు వద్ద నామినేషన్ కేంద్రాలను సందర్శించి, నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరును, భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.

జిల్లా ఎస్పీ *శ్రీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్ గారు* మాట్లాడుతూ –

🔹 ఎన్నికల ముందు, ఎన్నికల రోజు, ఎన్నికల తరువాత ఏర్పడే పరిణామాలకు అనుగుణంగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

🔹 మున్సిపల్ ఎన్నికలను శాంతియుతంగా, సజావుగా, పారదర్శకంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు అన్ని భద్రత చర్యలు చేపట్టామన్నారు.

🔹 రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సూచించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC) ని ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.

🔹 రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిబంధనల మేరకు నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలోని అభ్యర్థులతో వచ్చే మద్దతుదారులను నిలిపి వేయాలన్నారు.

🔹 ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థితోపాటు ముగ్గురిని మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి అనుమతించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

🔹సోషల్ మీడియాలో అసత్య వార్తలను ప్రచారం చేయవద్దని, సంబంధిత అధికారులతో మాట్లాడి, వాస్తవాలను నిర్ధారించుకున్న తరువాతనే వార్తలను ప్రచురించాలన్నారు.

🔹 ఎన్నికల నేపథ్యంలో విస్తృత తనిఖీలు చేపడుతున్నందున ఎటువంటి ఆధారాలు, పత్రాలు లేకుండా రూ. 10వేలుకి మించి నగదును తమ వెంట తీసుకొని వెళ్లవద్దని, ఆన్లైన్ లావాదేవీలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

🔹 జిల్లాలో ఎటువంటి సమస్యాత్మక ప్రాంతాలు లేవని, ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు.

🔹 నామినేషన్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లను, నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరును జిల్లా ఎస్పీ పరిశీలించారు.

🔹 నామినేషన్ కేంద్రాల వద్ద ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రత్యేక దళాలను, స్పెషల్ పార్టీ పోలీసులను నియమించామన్నారు.

జిల్లా ఎస్పీ వెంట విజయనగరం డిఎస్పీ ఎస్.లక్షణమూర్తి, మున్సిపల్ కమీషనర్ బి.బాలస్వామి, వన్ టౌన్ సిఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి, ఎస్.కోట సిఐ వి.ఎన్.మూర్తి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి