విజయనగరం నగరపాలక సంస్థకు జరుగుచున్న ఎన్నికలలో భాగంగా ఈరోజు 13వ, 14వ, 15వ డివిజన్ లకు సంబంధించి పుత్సల వీధి జంక్షన్ లో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు గారు, జడ్పీ మాజీ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారు ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మేయర్ అభ్యర్థి శ్రీమతి అవనాపు భార్గవి గారు, కార్పొరేటర్ అభ్యర్థులు శ్రీ అవనాపు విజయ్ గారు, శ్రీమతి తాడ్డి భగవతి గారు పాల్గొన్నారు.






