స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ‘పిజిఆర్ఎస్’ కార్యక్రమం రద్దు *విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్

స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ‘పిజిఆర్ఎస్’ కార్యక్రమం రద్దు
*విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్

జిల్లాలో స్థానిక సంస్థల (మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ సర్పంచ్) ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎలక్షన్ కోడ్) అమలులోకి వచ్చినందున, ప్రతీ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించాల్సిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (పి.జి.ఆర్.ఎస్)ను రద్దు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ *శ్రీ ఎఆర్ దామోదర్, ఐపిఎస్ గారు* అక్టోబర్ 18న తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల కోడ్ అక్టోబర్ 14 నుండి డిసెంబర్ 03 వరకు అమలులో ఉంటున్నందున, ఈ గడువు ముగిసే వరకు ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. కావున, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఒక ప్రకటనలో జిల్లా ఎస్పీ *శ్రీ ఎఆర్ దామోదర్, ఐపిఎస్ గారు* కోరారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి