ఎడతెరిపి లేకుండా వరుసగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో మండల వాసులు *విద్యుత్ ప్రమాదాలకు* గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. వర్షాకాలంలో ఎవరు విద్యుత్ స్తంభాలను టచ్ చేయవద్దు, మన ఇండ్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే అనుభవం కలిగిన ఎలక్ట్రీషియన్ తో మాత్రమే విద్యుత్ పనులను చేయించుకోవాలి. గ్రామాల్లో పని చేసే *ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ లు* ఎటువంటి విద్యుత్ ప్రమాదాల గురికాకుండా *తగు జాగ్రత్తలతో* పనిచేయాలి. *హై టెన్షన్ వైర్లుకు తగులుతున్న చెట్ల కొమ్మలను, తీగలను* గ్రామస్తులు తొలగించకుండా విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించి వారిద్వారా *హై టెన్షన్ వైర్లుకు తగులుతున్న చెట్ల కొమ్మలను, తీగలను* తొలగించేవిధంగా చర్యలు తీసుకోవాలి *ఇంట్లో వాడే వాటర్ హీటర్లకు చిన్నపిల్లలు దూరంగా* ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకొని వాడాలి. అని పాచిపెంట si
ఎల్ అర్జున్ తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి