బైక్ ఆక్సిడెంట్ లో గాయాలపాలైన వైసీపీ అభిమాని తాడ్డి.ఢిల్లీశ్వరరావు గారు. విజయనగరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తాడ్డి.ఢిల్లీశ్వరరావు గారిని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు. సాలూరు పట్టణం,డబ్బీవీధికి చెందిన వైసీపీ అభిమాని తాడ్డి.ఢిల్లీశ్వరరావు గారికి కొద్దిరోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ జరిగింది.విజయనగరం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు& రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ పీడిక.రాజన్నదొర గారు ఈరోజు మధ్యాహ్నం విజయనగరంలో ఉన్న ఆ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి తాడ్డి.ఢిల్లీశ్వరరావు గారిని పరామర్శించారు.ఈ సందర్భంగా తాడ్డి.డిల్లీశ్వరరావు గారి ఆరోగ్య పరిస్థితి కోసం అక్కడ వైద్యులను మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు అడిగి తెలుసుకున్నారు. తదనంతరం ఢిల్లీశ్వరరావు గారి కుటుంబ సభ్యులతో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు మాట్లాడుతూ మీరు ఎటువంటి అధైర్య పడాల్సిన అవసరం లేదని,డాక్టర్లతో మాట్లాడానని, మీకు ఏ అవసరం వచ్చినా నన్ను సంప్రదించవచ్చునని,మీకు అండగా ఉంటానని ధైర్యం తెలిపారు.పరామర్శించిన వారిలో జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి దండి.శ్రీనివాసరావు గారు మరియు తదితరులు ఉన్నారు.

