విజయనగరం జిల్లా
చీపురుపల్లి నియోజకవర్గం
చీపురుపల్లి పట్టణంలో గల బాబుజి హాస్పిటల్
అందరికి నమస్కారం నా పేరు ఏ నేతులు గౌరి నాయుడు మా గ్రామం గరివిడి మండలం కాపు సంబం నా భార్య ఏ నేతల మౌనికకు నెలలు నుండి ప్రసవం కోసం చీపురుపల్లి బాపూజీ హాస్పిటల్ లో 8 వ తారీకు ఉదయం మా అన్నయ్య గవిడి సురేష్ స్వామికి చెప్పి అడ్మిట్ చేయడం జరిగింది. సాధారణ ప్రసవం అవుతుందని కంగారు పడవద్దని సాయంత్రం వరకు చూసి చేస్తామని సదరు డాక్టర్లు చెప్పడం జరిగింది సాయంత్రం 6 గంటలకు డాక్టర్ శైలజ గారు వచ్చి నార్మల్ డెలివరీ అవ్వడం లేదు సర్జరీ చేయాలని తెలపగా మేము సమ్మతించాము తరువాత కొంతసేపటికి సర్జరీ చేసి బాబు పుట్టాడు కానీ ఆరోగ్య స్థితి బాగోలేక చనిపోయినారు అని తెలుపుగా మేము ఆ బాధలో వారితో వాగ్వాదం చేశాము తర్వాత మాకు డాక్టర్లు వివరించగా మేము అలాగే మా పెద్దలు గవిడి సురేష్ మహంతి సూర్యారావు కో రాడ శ్రీను మరియు ఇతర పెద్దలు మమ్ములను వాదార్చి డాక్టర్ తో మాట్లాడి జరిగిందేదో జరిగింది ఇప్పుడు ఆ తల్లికి బాధ్యతగా వైద్యం చేసి ఆరోగ్యంగా మా ఇంటికి పంపించే విధంగా చేయండి అని డాక్టర్లతో చెప్పి మాకు ఒప్పించడం జరిగింది. కానీ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలోనూ మరి కొంతమంది మేము ఏదో ఆర్థిక ఒప్పందం చేసుకున్నామనే వార్త కొన్ని మీడియా లో వచ్చిన అపోహలు మమ్మల్ని మానసికంగా బాధకు గురి చేస్తున్నాయి. మా కన్న బిడ్డ మాకు దూరమైంది నా భార్య ఇప్పుడు ఆపరేషన్ అయ్యి ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది పుట్టిన బిడ్డ చనిపోయిందని ఆ తల్లికి ఇంకా మేము చెప్పలేదు విజయనగరంలో వైద్యం అవుతుందని అబద్ధం చెప్పి ఆవిడకు ట్రీట్మెంట్ చేయిస్తున్నాము దయచేసి ఈ అపోహలు ఇంతటితో ఆపి నా భార్యకు మెరుగైన వైద్యం అందుతుంది దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోగలరు.