విషాదం.. తొమ్మిదో తరగతి విద్యార్థిని మృతి

విషాదం.. తొమ్మిదో తరగతి విద్యార్థిని మృతి

కడుపునొప్పితో మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల వెల్లడి

ఘటనపై జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చినట్లు హెచ్ఎం శివకుమార్ వెల్లడి

సాలూరు, నవంబర్ 20:

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కురుకూటి గ్రామంలోని జీటీడబ్ల్యూఏజీహెచ్ఎస్ (GTWAGHS) గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న తాడంగి లావణ్య అనే విద్యార్థిని మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థిని పుష్పవతి కావడంతో నవంబర్ 11, 2026న మధ్యాహ్నం ఆమె తల్లి తాడంగి అమ్మోజి పాఠశాల నుంచి ఇంటికి తీసుకువెళ్లారు. అనంతరం నవంబర్ 19వ తేదీ సాయంత్రం అకస్మాత్తుగా కడుపునొప్పి రావడంతో లావణ్య మృతి చెందినట్లు ఆమె మావయ్య, పెదనాన్న వెల్లడించారు.

చక్కగా చదువుకుంటున్న విద్యార్థిని ఆకస్మికంగా మృతి చెందడంతో గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఈ ఘటనపై పాఠశాల హెచ్ఎం శివకుమార్‌ను వివరణ కోరగా.. విద్యార్థినికి పాఠశాలలో ఉన్న సమయంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తెలిపారు. పుష్పవతి అయిన సందర్భంగా తల్లిదండ్రులు వచ్చి నవంబర్ 11న తమతో పాటు స్వగ్రామానికి తీసుకువెళ్లారని వివరించారు. అనంతరం కడుపునొప్పి రావడంతో మృతి చెందినట్లు తల్లిదండ్రులు తమకు తెలిపారని పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు హెచ్ఎం శివకుమార్ మీడియాకు వెల్లడించారు.

విద్యార్థిని మృతికి గల ఖచ్చితమైన కారణాలు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి