అంగరంగ వైభవంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసిన రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ ఆహ్వానితులను ఆకట్టుకున్న పోలీసు డాగ్స్ ప్రదర్శనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప పోలీసు సేవా పతకాలు, అంత్రిక్ సురక్ష పతకాలను ప్రధానం చేసిన మంత్రివర్యులు* 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పోలీసు పరేడ్ గ్రౌండులో ఆగస్టు 15న అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ., సెర్ఫ్ మరియు ఎన్.ఆర్.ఐ. వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరై, జెండా ఆవిష్కరణ చేసారు. జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్, జిల్లా కలెక్టరు ఎస్.రంసుందర్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారికి స్వాగతం పలికారు. సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించిన మంత్రివర్యులును పరేడ్ పర్యవేక్షణకు గాను జిల్లా ఎస్పీ మరియు జిల్లా కలెక్టరు, ప్రత్యేక వాహనంలో తీసుకొని వెళ్ళారు. అనంతరం, వేడుకులకు హాజరైన ప్రజా ప్రతినిధులను, జిల్లా అధికారులను మంత్రివర్యులు పరిచయం చేసుకొని, వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేసారు. పోలీసుశాఖలో విధి నిర్వహణలో సమర్ధవంతంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, సిబ్బందికి గతంలో ప్రభుత్వం, ప్రకటించిన సేవా పతకాలను, ఆంత్రిక సురక్ష పతకాలను, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రదానం చేసారు. అదే విధంగా విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేసారు. ఈ సందర్భంగా పోలీసు పరేడ్ గ్రౌండులో పోలీసు డాగ్స్ రుద్ర, వాగా మరియు లవ్లీ చేసిన విన్యాసాలు ఆహ్వానితులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం, వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్వానితులను ఆకట్టుకున్నాయి. జిల్లా సాధించిన ప్రగతిని, సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మంత్రివర్యులు తన ప్రసంగం ద్వారా ప్రజలకు తెలియజేసారు. అనంతరం, వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రివర్యులు, అధికారులు పరిశీలించారు. వివిధ శాఖల శఖటాలను వేడుకల్లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్, జిల్లా కలెక్టరు ఎస్.రాంసుందర్ రెడ్డి,ఐఏఎస్, ప్రజా ప్రతినిధులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్ధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 150 అడుగుల జాతీయ జెండా తో భారీ ర్యాలీ విజయనగరంలోని కోలగట్ల నివాసంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు