బొబ్బిలి, సెప్టెంబర్ 21: మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా బొబ్బిలి కోటలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు (బేబీనాయన) పార్టీ శ్రేణులతో కలిసి గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ.. గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యానికి కొత్త దిశానిర్దేశం చేసిన మహాకవి అని పేర్కొన్నారు. తన రచనల ద్వారా సమాజంలోని మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలను ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని అన్నారు. “దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్” అనే సందేశం ద్వారా సమాజం పట్ల ప్రతి ఒక్కరికీ బాధ్యతను గుర్తుచేశారని తెలిపారు. గురజాడ రచనలు నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ బాలసారే వేడుకలో సందడి చేసిన ప్రముఖులు సతివాడలో రెపరెపలాడిన జనసేన జెండా.. శ్రేణుల్లో నూతనోత్సాహం