చీపురుపల్లి మేజర్ పంచాయతీ పట్టణంలో దేవాంగులవీధిలో నిన్న రాత్రి 8:30 గంట సమయంలో వీధిలో తన ఇంటి ముందు ఉన్న వాకిట్లో నిలబడిన వ్యక్తిని మొదట పిచ్చి కుక్క కరిచింది వెంటనే అతను తమ్ముడు కుక్కను కొట్టబోతే అది అతని చెయ్యి మీద కరిసింది వెంటనే కుటుంబ సభ్యులు బయటకు రావడంతో వాళ్ళ అందరిపై విరుచుకుపడింది నలుగురిని కరిచి గాయపరిచి అక్కడ నుంచి పారిపోయింది స్థానికులు వచ్చి వెంబడించిన అది రైల్వే ట్రాక్ పైనుంచి చీకట్లోకి వెళ్లిపోయింది. గాయపడిన వాళ్ళంతా ఒకే కుటుంబానికి చెందినవారు పండిత సంతోష్ కుమార్ అతని భార్య పండిత విష్ణుప్రియా, అత్తయ్య పండిత కళ్యాణి కాళీ వెనుక భాగం మోకాళ్ళ మీద గట్టిగా కరిసింది మేనల్లుడు పండిత గోవర్ధన్ చెయ్యి మొత్తం చీరేసింది వెంటనే విషయం తెలుసుకున్నజడ్పీటీసీప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాస నాయుడు వెంటనే హాస్పిటల్ కి ఫోన్ చేసి వ్యాక్సిన్ టీకాలు వేయించి ప్రథమ చికిత్స చేయించారు. పంచాయతీ వారు కుక్కల పట్ల తగిన చర్య తీసుకోవట్లేదని ప్రజలందరూ వలిరెడ్డి శీనువాసనాయుడు కి తెలియజేశారు. రాత్రి కనుక ఎవరు అందుబాటులో ఉండరని వారికి తెలియజేశారు. ప్రజలు కుక్కల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు పంచాయతీ కార్యదర్శి వారికి లిఖితపూర్వకంగా వీధి వారందరూ ఒక దరఖాస్తు ఇస్తే తప్పకుండా తగుచర్యలు తీసుకుంటారని తెలిపారు. Spread the love టపా నావిగేషన్ చీపురుపల్లి శాసన సభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళావెంకట రావు గారి సమక్షంలో.. టీడీపీ లో చేరిన సుమారు 200 కుటుంబాలు.