రెండో రోజు జెడ్పీ విధుల్లో చైర్మన్ సిరిసహస్ర మర్యాదపూర్వకంగా కలిసిన ప్రజాప్రతినిధులు
విజయనగరం, నవంబర్ 21:
విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి మజ్జి సిరి సహస్ర (సిరమ్మ) గారు శనివారం రెండవ రోజు జిల్లా పరిషత్ కార్యాలయంలో అడుగుపెట్టి, తన ఛాంబర్లో ఆసీనులయ్యారు. తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటరీ పరిశీలకులు మరియు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి కుమార్తె అయిన సిరి సహస్ర గారి రాకతో జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది.
రెండో రోజు విధులకు హాజరైన జెడ్పీ చైర్మన్‌ను కలిసేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజాప్రతినిధులు, స్థానిక ముఖ్య నాయకులు మరియు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా వారంతా సిరి సహస్ర గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యాలయానికి విచ్చేసిన నాయకులు, ప్రజాప్రతినిధులను చైర్మన్ సిరి సహస్ర గారు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అందరి సహకారంతో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు.






