విజయవాడ 21 నవంబర్ :
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ నూతన కమిటీ నియామకం శనివారం విజయవాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జరిగింది.
ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శులు బి. నాగ సాయి ప్రసాద్
మాట్లాడుతూ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గా పి. వెంకట నారాయణ ఎస్.లక్ష్మీ లను, రాష్ట్ర అధ్యక్షులు గా ఎన్. సీతారామరాజు ను, రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఎస్ ఎస్ ఎన్ మూర్తి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా ఎస్. సోమేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్. వినయ్ కుమార్ మరియు రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్‌గా పి రజనీకాంత్ లను నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పౌండర్ సుమిత్రానందన్ నూతన
కమిటీని అభినందించారు.
