filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; runfunc: 0; algolist: 0; multi-frame: 1; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; motionR: 0; delta:1; bokeh:1; module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 342.40143;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?Mostly clear, icon:0, weatherInfo:100;temperature: 35;zeissColor: bright;

దొరికిన 900 గ్రాముల ఆభరణాలపై ఆశ చూపని లావేటి ఉమా కు టౌన్ సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఘన సత్కారం

సాలూరు:
విలువైన బంగారు ఆభరణాలు దొరికినా వాటిపై ఆశ చూపకుండా పోలీసులకు సమాచారం అందించి నిజాయితీ చాటుకున్న డబ్బివీధికి చెందిన లావేటి ఉమ సమాజానికి ఆదర్శంగా నిలిచారు. సుమారు రూ.కోటి విలువైన 900 గ్రాముల బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగు కనిపించకుండా పోయిన ఘటనలో ఆమె మానవత్వంతో వ్యవహరించారు.

సాలూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి బ్యాంకు లాకర్‌ నుంచి బంగారు ఆభరణాలను తీసుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో బ్యాగు జారిపడింది. విషయం గుర్తించిన ఆయన వెంటనే సాలూరు టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో పాటు క్షేత్రస్థాయిలో గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో డబ్బివీధికి చెందిన లావేటి ఉమ, భర్త లావేటి చంద్రశేఖర్‌ కు బ్యాగు దొరికింది. అందులో భారీగా బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించిన ఆమె ఎటువంటి స్వార్థానికి తావివ్వకుండా స్వచ్ఛందంగా పోలీసులకు సమాచారం అందించి బ్యాగును వారికి అప్పగించారు.

పోలీసులు ఆభరణాలు ఫిర్యాదుదారుడివేనని నిర్ధారించి సురక్షితంగా బాధితులకు అందజేశారు. ఫిర్యాదు అందిన కొద్ది గంటల్లోనే విలువైన ఆభరణాలను గుర్తించి యజమానులకు అప్పగించడంలో సాలూరు టౌన్ పోలీసులు కీలకంగా వ్యవహరించారు.

కాగా, ఆభరణాలు తిరిగి పొందిన బాధితులు ఈరోజు సాలూరు టౌన్ సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో లావేటి ఉమ ను ఘనంగా సత్కరించారు. పోలీసుల సమక్షంలో ఆమెకు కృతజ్ఞతలు తెలిపి, ఇంతటి విలువైన ఆభరణాలు దొరికినా వాటిపై ఆశ చూపకుండా స్వచ్ఛందంగా పోలీసులకు అప్పగించినందుకు అభినందించారు.

నేటి సమాజంలో లావాటి ఉమ వంటి నిజాయితీపరులు ఎంతో అవసరమని, ఆమె చూపిన బాధ్యతాయుతమైన వైఖరి అందరికీ ఆదర్శమని బాధితులు పేర్కొన్నారు. ఆమె నిజాయితీకి స్థానికులు, పోలీసు సిబ్బంది ప్రశంసలు తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి