*రామయ్యవలసలో జనసేన ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహణ – 100 కుటుంబాలు జనసేనలో చేరిక* చీపురుపల్లి నియోజకవర్గం, మెరకముడిదాం మండలం రామయ్యవలస గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం మరియు భారీ చేరికల కార్యక్రమం బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *చీపురుపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు గారు* మరియు *మెరకముడిదాం మండల అధ్యక్షురాలు రౌతు కృష్ణవేణి నాయుడు గారు* హాజరయ్యారు. వారితో పాటు నియోజకవర్గ, మండల స్థాయి జనసేన నాయకులు పాల్గొన్నారు. రామయ్యవలస గ్రామపంచాయతీకి చెందిన స్థానిక జనసేన నాయకులు *ఎమ్మాది నారాయణరావు గారు, గొర్లె రమేష్ గారు* మరియు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో సుమారు *100 కుటుంబాలకు పైగా* ఇతర పార్టీలను వీడి జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి శ్రీనివాసరావు గారు ఆహ్వానించారు. *ఈ సందర్భంగా విసినిగిరి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ…* “పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై రోజురోజుకూ జనసేనలో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. సమాజం కోసం, సేవ కోసం అనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పోరాటానికి రామయ్యవలస గ్రామ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మన గ్రామం – మన భవిష్యత్తు అనే లక్ష్యంతో ప్రతి గ్రామాన్ని బలోపేతం చేస్తాం. రామయ్యవలస నుండి చేరిన ప్రతి కుటుంబానికి అండగా ఉంటాం. వారి సమస్యలను నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరడం ఖాయం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ బొత్స సత్యనారాయణ గారి సమక్షంలో గెడ్డపువలసలో టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సుమారుగా 50 కుటుంబాలు చేరికలు గరివిడి మండలం, కొండదాడి పంచాయతీ నుండి.. మాజీ మంత్రివ చీపురుపల్లి శాసన సభ్యులు శ్రీ కిమిడి కళావెంకట రావు గారి సమక్షంలో.. సుమారు 50 కుటుంబాలు.,