ముత్యాలమ్మ ఆలయంలో దొంగల హల్చల్..! సీసీ కెమెరాలు ధ్వంసం.. హార్డ్‌డిస్కులు మాయం.. అర తులం ముక్కుపుడక, 15 పట్టు చీరలు, రెండు హుండీలు అపహరణ సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని ముత్యాలమ్మ తల్లి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు అమ్మవారి అర తులం ముక్కుపుడక, 15 పట్టు చీరలతో పాటు రెండు హుండీలను అపహరించారు. ఈ ఘటనతో సాలూరులో కలకలం రేగింది. ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకుడు తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆలయాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలు ధ్వంసం.. హార్డ్‌డిస్కులు అపహరణ చోరీకి పాల్పడిన దుండగులు ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. కెమెరాలకు సంబంధించిన హార్డ్‌డిస్కులను సైతం ఎత్తుకెళ్లారు. దీంతో చోరీకి సంబంధించిన దృశ్యాలు పోలీసులకు చిక్కకుండా సీసీ కెమెరాల వ్యవస్థనే ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఆలయానికి సుమారు 100 మీటర్ల దూరంలో రెండు హుండీలను పగలగొట్టి అందులోని నగదును దుండగులు తీసుకెళ్లారు. అనంతరం ఖాళీ హుండీలను అక్కడే వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆలయంలోని ఆధారాలను సేకరించడంతో పాటు దుండగులు వచ్చిన మార్గం, వెళ్లిన మార్గాలపై ఆరా తీస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని ఇతర సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ముత్యాలమ్మ తల్లి ఆలయంలో చోరీ జరగడంతో భక్తులు, స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆలయాల వద్ద భద్రతను మరింత పటిష్టం చేయాలని భక్తులు కోరుతున్నారు. /storage/emulated/0/Android/media/com.whatsapp/WhatsApp/Media/WhatsApp%20Video/VID-20261008-WA0107.mp4 Spread the love టపా నావిగేషన్ ర్యాగింగ్ చేస్తే కెరీర్‌కే ‘రెడ్ కార్డ్’.. సాలూరు టౌన్ పోలీసుల హెచ్చరిక! ముత్యాలమ్మ ఆలయంలో దొంగల హల్చల్..!