చేయి చేయి కలుపుదాం జంఝావతిని సాధిద్దాం…………. చేయి చేయి కలుపుదాం జంఝావతిని సాధిద్దామని గ్లోబల్ స్ఫూర్తి డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు బలగ రాధా నాయుడు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గత 22 రోజులుగా జంజావతి సాధనకు జరుగుతున్న సాధన దీక్షకు గ్లోబల్ స్ఫూర్తి డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు మంగళవారం మద్దతు తెలిపారు. ముందుగా ప్రధాన రహదారిలో జంజావతి సాధనకు ర్యాలీ నిర్వహించి అనంతరం దీక్షా శిబిరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బలగ రాదానాయుడు, వానపల్లి శంకరరావులు మాట్లాడుతూ జంజావతి ప్రాజెక్టు ద్వారా సాగునీరు రైతులు అందించేందుకు ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నాయని భారతదేశానికి రైతే రాజు రైతే వెన్నెముక అని ఎన్నికల ముందు ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్న పాలకులకు జంజావతి సాగునీటి రైతుల కష్టాలు తెలియవా అని ప్రశ్నించారు.ప్రతి ఎన్నికల ముందు జంజావతి సాగునీటిని రైతులకు అందజేస్తామని హామీలు ఇచ్చి ఎన్నికల అయిన అనంతరం ఇరు రాష్ట్రాల సమస్య కారణంగా పరిష్కరించడంలో జాప్యం జరుగుతుందని కప్పదాటు కబుర్లు చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. గతంలో జంజావతి సమస్య పరిష్కారం కొరకు ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబును కోరడం జరిగిందన్నారు. ప్రస్తుతం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నాయని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జంజావతి ప్రాజెక్టు పై దృష్టి సారించి రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జంఝావతి ప్రాజెక్టు సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రతి ఒక్కరూ ఈ సాధన దీక్షకు మద్దతు తెలపాలని కోరారు.కార్యక్రమంలో గ్లోబల్ స్ఫూర్తి డెవలప్‌మెంట్ సొసైటీ ఉపాధ్యక్షుడు సాలాపు అనంతరావు, బెహరా బాబ్జి, బేతా నాగభూషణరావు, అక్కేన శ్రీహరి నాయుడు, సీరాపు వెంకట మహేష్, సాధన సమితి నాయకులు చుక్క భాస్కరరావు, మరిశర్ల క్రిష్ణమూర్తి నాయుడు, పల్లి రాజగోపాల్ నాయుడు, వంగల దాలి నాయుడు, పిల్లా లక్ష్మునాయుడు, ఆర్. తవిటినాయుడు, వెలగల సన్యాసినాయుడు, బురద వెంకటాపురం గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి