కొఠియాలో ఉన్న గిరిజనులను, ఒరిస్సా ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేయడం చాలా దారుణం: మంత్రి సంధ్యారాణి
గిరిజనులను తీసుకెళ్లి దాచేస్తున్నారు… ఇది దుర్మార్గమైన చర్య కాదా?
గిరిజనుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు
29 గిరిజన గ్రామాలను చాలా ఇబ్బందులు పెడుతున్నారు
ఎన్నికలను బహిష్కరించాలని గిరిజనులపై ఒత్తిడి తేవడం చాలా బాధాకరం
ఎన్నికలను వాయిదా వేయాల్సిన పని ఎలక్షన్ కమిషన్ ది
గ్రామాల్లోకి వచ్చి గిరిజనులను భయభ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసం?
ఎప్పటినుంచో ఉన్న సుప్రీంకోర్టు స్టేటస్కో ను ఈరోజే వచ్చినట్లు ఎందుకు హడావుడి చేస్తున్నారు
ఎన్నికలను బహిష్కరించాలంటూ అభ్యర్థులను బెదిరించడం సరైన పద్ధతి కాదు.
ఆంధ్రప్రదేశ్ అధికారులపై, పోలీసులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఒరిస్సా అధికారులు
గిరిజనులు ఓటు వేయడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య విరుద్ధం.
కొటియా గ్రామాల్లో గత కొన్ని రోజులుగా ఒడిశా అధికారులు హల్చల్ చేస్తూ గిరిజనులను భయపెడుతున్నారు.
గిరిజనులు ఓటు వేయడానికి వస్తారనే భయంతో వారి వాహనాలను సైతం స్వాధీనం చేసుకోవటం ఎంతవరకు న్యాయం?
అమాయక గిరిజనుల స్వేచ్ఛను, ఓటు హక్కును హరించే ప్రయత్నాలను సహించేది లేదు
గిరిజనులను భయపెట్టకుండా, వారి హక్కులను గౌరవిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని ఒడిశా అధికారులకు తెలియజేస్తున్నాం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనులకు అండగా ఉంటుంది: మంత్రి సంధ్యారాణి
