జై ఆంధ్ర (జై భారత్) సమాచార హక్కు సంఘం ఆధ్వర్యంలో 6వ వార్షికోత్సవ వేడుకలు
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మహిళా గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్. మల్లేశ్వరి
విజయవాడ, నవంబర్ 1:
జై ఆంధ్ర (జై భారత్) సమాచార హక్కు సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 24న విజయవాడలో జాతీయస్థాయిలో సమాచార హక్కు చట్టం (RTI Act-2005) పై అవగాహన సదస్సుతో పాటు సంఘం 6వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధులు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, నిర్వహణ షెడ్యూల్‌పై చర్చించేందుకు నవంబర్ 1న విజయవాడలోని జై ఆంధ్ర కార్యాలయంలో కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి రాష్ట్ర మహిళా గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్. మల్లేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బి. అనిత మాట్లాడుతూ, రాబోయే జాతీయస్థాయి సదస్సును విజయవంతం చేసేందుకు కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
రాష్ట్ర అధ్యక్షులు పి. వెంకట్ నారాయణ మాట్లాడుతూ, కార్యక్రమానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్ ప్రకటిస్తారని వెల్లడించారు.
అలాగే జై ఆంధ్ర (జై భారత్) జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీమతి నోరి నాగ పల్లవి ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శ్రీమతి ఎస్. మల్లేశ్వరి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షురాలు ద్రాక్షాయిని తదితరులు పాల్గొన్నారు.
