మీడియా ఒక శక్తి.. జర్నలిస్టులకు ఆర్టీఐ చట్టంపై అవగాహన అవసరం
జై ఆంధ్ర (జై భారత్) వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్
రాజమహేంద్రవరం, నవంబర్ 9:
మీడియా ప్రజాస్వామ్యంలో ఒక శక్తివంతమైన వ్యవస్థ అని, జర్నలిస్టులు సమాచార హక్కు చట్టం (RTI Act–2005) పై పూర్తి అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని జై ఆంధ్ర (జై భారత్) వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి. వెంకటనారాయణ మాట్లాడుతూ.. వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సుమిత్రానందన్ ఈరోజు పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ జె.వి. సుబ్రహ్మణ్యంను మర్యాదపూర్వకంగా కలిసి, జై ఆంధ్ర భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమాలతో పాటు ప్రస్తుత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు.
గత 12 సంవత్సరాలుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం డాక్టర్ సుమిత్రానందన్ నిరంతరం పోరాటం చేస్తున్నారని వెంకటనారాయణ వివరించారు.
జర్నలిస్టులు తమ వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆర్టీఐ చట్టం-2005పై అవగాహన పెంపొందించుకోవాలని, ఈ చట్టం ద్వారా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, జై ఆంధ్ర నూతన కమిటీ సమావేశం ఈ నెల 24న విజయవాడలో నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో మీడియా ద్వారా వెల్లడిస్తామని పి. వెంకటనారాయణ తెలిపారు.

