పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు..
ఆటో – ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి
సాలూరు మండలంలో ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన సాలూరు మండలం పందిరిమామిడివలస గ్రామ కూడలి వద్ద చోటుచేసుకుంది.
సాలూరు మండలం చిన్న ఊటగెడ్డ గ్రామానికి చెందిన అరసాడ తిరుపతిరావు (41) మామిడిపల్లి నుండి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. తిరుపతిరావు భార్య జయంతి కురుకూటి ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నారు.
పందిరిమామిడివలస గ్రామ కూడలి వద్ద ఎదురుగా వస్తున్న ఆటో, ఆయన ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో తిరుపతిరావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
భర్త ప్రమాద వార్త తెలియడంతో భార్య హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. భర్త మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
తిరుపతిరావు దంపతులకు సంతానం లేదు.పెళ్లి జరిగి మూడు సంవత్సరాలయింది
సమాచారం అందుకున్న సాలూరు రూరల్ ఎస్సై రవీంద్రరాజు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.
