సాలూరు మండలంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. 29 గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ల ప్రకటన

సాలూరు, నవంబర్ 20 (9 న్యూస్ తెలుగు):

లోకేష్ రిపోర్టర్, సాలూరు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో రెండో విడత సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరాలను జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించారు.

ఈ మేరకు సాలూరు మండలంలోని మొత్తం 29 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ స్థానాలు, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ అధికారిక వివరాలను విడుదల చేశారు.

రిజర్వేషన్ల వివరాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ కేటగిరీలకు కేటాయింపులు చేశారు. అలాగే మహిళలకు కూడా వివిధ కేటగిరీల్లో స్థానాలు కేటాయించారు.

మండలంలోని అన్నమరాజువలస, దెంసరాయి, గంజాయిభద్ర, జీగిరాం, జీల్లెడువలస, కందులపదం, కరడవలస, కరసువలస, కోడమ, కొత్తవలస తదితర 29 పంచాయతీలకు సంబంధించిన రిజర్వేషన్ల పట్టికను అధికారులు విడుదల చేశారు.

రిజర్వేషన్లు ప్రకటించడంతో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు తమ తమ గ్రామాల్లో రాజకీయ సమీకరణాలను ప్రారంభిస్తున్నారు.

రిజర్వేషన్ల పూర్తి వివరాలు అధికారికంగా విడుదలైన పట్టికలో పొందుపరిచారు.

మరిన్ని స్థానిక వార్తల కోసం చూస్తూ ఉండండి.. THE 9 NEWS TELUGU.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి