బంగారమ్మపేటలో అయ్యప్ప స్వాముల భజనలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర
సాలూరు, నవంబర్ 23:
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని బంగారమ్మపేటలో నిర్వహించిన అయ్యప్ప స్వాముల భజన కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం భజన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కొంతసేపు గడిపారు.
ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు రాజన్నదొరను ఘనంగా సత్కరించి స్వామివారి ఆశీస్సులు అందజేశారు. భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.


THE 9 NEWS TELUGU నిజం… మా లక్ష్యం.