అనధికార మద్యం విక్రయాలపై ఉక్కుపాదం

అనధికార మద్యం విక్రయాలపై ఉక్కుపాదం

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎక్సైజ్ సీఐ గుల్లిపల్లి దాస్

సాలూరు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అనధికార మద్యం విక్రయాలు, నాటుసారా తయారీ, రవాణా మరియు బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సీఐ గుల్లిపల్లి దాస్ తెలిపారు.

ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు మొత్తం 100 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరిలో 12 మంది నాటుసారా కేసులకు సంబంధించిన వారు కాగా, 88 మంది బెల్ట్ షాపుల కేసులకు సంబంధించిన వారని తెలిపారు.

అలాగే రెండు నాటుసారా కేసులు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుమారు 8 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరోవైపు బెల్ట్ షాపులకు సంబంధించి 13 కేసులు నమోదు చేసి, 13 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసుల్లో సుమారు 55 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు వివరించారు.

రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎవరైనా అనధికారికంగా మద్యం విక్రయించినా, నాటుసారా తయారు చేసినా లేదా విక్రయించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ గుల్లిపల్లి దాస్ హెచ్చరించారు.

ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రజలు ఎక్సైజ్ శాఖకు సహకరించాలని ఆయన స్థానిక విలేకరులకు తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి