విశ్వబ్రాహ్మణుల ఐక్యతే లక్ష్యం – పంచవృత్తుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కలిసిరావాలి
డిసెంబర్ 4న విజయనగరంలో ఉత్తరాంధ్ర విశ్వబ్రాహ్మణుల కీలక సమావేశం
విజయనగరం: విశ్వబ్రాహ్మణుల సంప్రదాయ పంచవృత్తులు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంటున్న నేపథ్యంలో వాటి పరిరక్షణతో పాటు విశ్వబ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాలకు చెందిన విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు, సభ్యులు చిన్న చిన్న విభేదాలను పక్కనపెట్టి ఒకే సంఘంగా, ఒకే మాటపై, ఒకే బాటలో ప్రయాణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
రాబోయే భావితరాలకు మంచి నాయకత్వాన్ని అందించడంతో పాటు పంచవృత్తుల పరిరక్షణ, సంఘ బలోపేతం, విశ్వబ్రాహ్మణుల ఆర్థిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఆహ్వాన సంఘం ప్రత్యేకంగా కృషి చేస్తోందని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాల విశ్వబ్రాహ్మణ నాయకులు, ప్రతినిధులతో డిసెంబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు విజయనగరంలోని మయూరి హోటల్ వెనుక భాగంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రస్తుతం రెండు వర్గాలుగా ఉన్న నాయకులు, సభ్యులందరూ ఐక్యంగా ఒకే వేదికపైకి వచ్చి ఈ సమావేశానికి హాజరుకావాలని కోరారు. ముఖ్యంగా కొమ్మనబిల్లి గౌరీశంకరరావు గారు తమ బృందంతో సహా సమావేశానికి హాజరై ఐక్యతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
మనలో ఉన్న చిన్న చిన్న విభేదాలను పక్కనపెట్టి మన పంచవృత్తులను కాపాడుకోవడానికి, సంఘాన్ని బలోపేతం చేయడానికి, ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశానికి పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరై విశ్వబ్రాహ్మణ ఐక్యతను చాటాలని చెరుకూరి ఈశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
