చీపురుపల్లి నియోజకవర్గం, చీపురుపల్లి పట్టణంలో నూతనముగా ప్రారంభించబడిన *కే కే ఆటో కన్సల్టెన్సీని ( K K AUTO CONSULTANCY ) సందర్శించిన *తెలుగుదేశం పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షులు మరియు చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ కిమిడి నాగార్జున గారిని ప్రోప్రైటర్ శ్రీ కోట్ల కృష్ణ గారు* దుస్సాలువతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కోట్ల కృష్ణని అభినందించి వ్యాపార రంగంలో మరింత రాణించి యువత సూక్ష్మ ,చిన్న ,మధ్య తరహా వ్యాపార మరియు పరిశ్రమలు స్థాపించి మరింత ఉపాధి కల్పించే విధముగా తయారవ్వాలని తద్వారా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు, జనసేన నాయకులు పాల్గొన్నారు.