రోడ్డు ప్రమాదంలో ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, గుర్రాలపాలెం వాసులు ఇద్దరు మృతి..*
మరో ఇద్దరి పరిస్థితి విషమం,పలువురికి గాయాలు..*
*విషయం తెలిసి హుటాహుటిన రిమ్స్ హాస్పిటల్ కు చేరుకున్న ఎంపీ కలిశెట్టి
వైద్య సిబ్బంది, ఆర్డీవో గారితో కలిసి పరిస్థితిని సమీక్షించిన ఎంపీ కలిశెట్టి
రిమ్స్ హాస్పిటల్, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, గుర్రాలపాలెం గ్రామానికి చెందిన పలువురు భక్తులు జలుమూరు మండలం శ్రీ ముఖలింగం ఆలయ దర్శనం కోసం వెళ్లి తిరుగు ప్రయాణం లో రోడ్డు ప్రమాదం లో చిక్కుకొని ఇద్దరు మృతి చెందారు. క్షతగాత్రులను ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన రిమ్స్ కు, జెమ్స్ కు చేరుకొని పరిస్థితి సమీక్షించి, క్షత గాత్రులను పరామర్శించి, వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించవలసిందిగా కోరారు.అలాగే తక్షణమే మెరుగైన వైద్యం కోసం, తక్షణ సహాయక చర్యల కోసం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఓదార్చిన విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు.








