విజయనగరం, ఫిబ్రవరి 26: పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకుని ముస్లిం మైనారిటీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మైనారిటీ సంక్షేమ అధికారి షేక్ మహబూబ్ షరీఫ్ మరియు జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అదేశించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం వేళల్లో ప్రార్థనలు (నియమ నిష్టలు) చేసుకునేందుకు వీలుగా, రంజాన్ మాసం పొడవునా పనివేళల ముగింపు సమయానికి ఒక గంట ముందుగానే కార్యాలయం వదిలి వెళ్లేందుకు అనుమతించాలని తెలిపారు. మసీదులు, ప్రార్థనా మందిరాలు మరియు ముస్లింలు నివసించే ప్రాంతాలలో మున్సిపల్ మరియు పంచాయతీరాజ్ అధికారులు పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్ చేయించడం ద్వారా పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. ముఖ్యంగా సెహ్రీ, ఇఫ్తార్ మరియు ప్రత్యేక ప్రార్థనల సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, పౌర సరఫరాల శాఖ ద్వారా బియ్యం, గోధుమలు, చక్కెర వంటి నిత్యావసర వస్తువులు తగినంత అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రార్ధన సమయాల్లో హోటళ్లు, కూరగాయల మార్కెట్లు తెరిచి ఉంచేందుకు పోలీసు శాఖ అనుమతులు మంజూరు చేయాలని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మరియు బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఈద్-ఉల్-ఫితర్ పండుగ రోజున ఈద్గా మైదానాలను చదును చేయాలని, పారిశుధ్య పనులు ముందస్తుగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. Spread the love టపా నావిగేషన్ 53 డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ. 5.30 లక్షల జరిమా