దుర్గమ్మ ఆలయ అన్నదానానికి రూ.లక్ష విరాళం అందజేత

దుర్గమ్మ ఆలయ అన్నదానానికి రూ.లక్ష విరాళం అందజేత

జై ఆంధ్ర (జై భారత్) ఇన్‌చార్జ్ అధ్యక్షురాలు బి. అనిత, రాష్ట్ర మహిళా గౌరవ అధ్యక్షురాలు ఎస్. మల్లేశ్వరి

విజయవాడ, నవంబర్ 12:

విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం నిర్వహణ నిమిత్తం జై ఆంధ్ర (జై భారత్) సమాచార హక్కు సంఘం తరఫున రూ.లక్ష విరాళాన్ని అందజేశారు.

జై ఆంధ్ర ఇన్‌చార్జ్ అధ్యక్షురాలు బి. అనిత, రాష్ట్ర మహిళా గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్. మల్లేశ్వరి కలిసి ఆలయ ఈవోకు లక్ష రూపాయల చెక్కును అందజేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు పి. వెంకటనారాయణ తెలిపారు.

ఈ సందర్భంగా బి. అనిత మాట్లాడుతూ జై ఆంధ్ర అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాసేవా కార్యక్రమాలతో ముందుకు దూసుకుపోతోందని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మరింత చేరువ కావడమే సంఘం లక్ష్యమని తెలిపారు.

రాష్ట్ర మహిళా గౌరవ అధ్యక్షురాలు ఎస్. మల్లేశ్వరి మాట్లాడుతూ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బి.హెచ్. సుమిత్రానందన్ మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.

జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీమతి నోరి నాగ పల్లవి ఆధ్వర్యంలో జై ఆంధ్ర సమాచార హక్కు సంఘం 6వ వార్షికోత్సవ వేడుకలను విజయవాడలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

సామాజిక సేవా కార్యక్రమాల్లో మహిళలు చురుకుగా పాల్గొంటూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి